సీఎం పర్యటనకు 490 మంది పోలీసులతో భద్రత
04-07-2026 12:00 AM
నాగర్‌కర్నూల్ జులై 3 ( విజయక్రాంతి ): సీఎం రేవంత్ రెడ్డి జూలై 4న ఊరుకొండ శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ పర్యటన నేపథ్యంలో 490 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని, ప్రతి అధికారి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
శుక్రవారం మాచర్లలో నిర్వహించిన బందోబస్తు సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్, పార్కింగ్, రోప్, బీడీ టీంలతో సమన్వయంగా భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ భీమ్ కుమార్, ఎస్త్స్ర రమాదేవి తదితరులు పాల్గొన్నారు.






