4 July, 2026 | 2:49 AM

వర్షం కోసం కృష్ణమ్మకు పూజలు

04-07-2026 12:00 AM

ఇటిక్యాల, జూలై 3: సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఇటిక్యాల మండల రైతులు శుక్రవారం వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని వావిలాల, సాతర్ల గ్రామాలకు చెందిన రైతన్నలు తమ కాడెద్దులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లి వద్దకు తరలివెళ్లారు.

అక్కడ కృష్ణానది జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపిస్తే.. సాగు పనులు ఊపందుకుంటాయని, రైతాంగం సుఖసంతోషాలతో ఉంటుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.