ఇంకా రాచరిక పోకడలు పోలేదు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, తెలంగాణ నూతన గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న శుక్లాకీ శుభాకాంక్షలు తెలియజేయడానికి సభకు హాజరవుతారని ప్రజలు ఆశించారు. ఇంకా రాచరిక పోకడలు పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలకు అనుగుణంగా మారకపోవడం, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం మన తెలంగాణ గౌరవానికి తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధిగా జీతభత్యాలు పొందుతూ విధులకు గైర్హాజరు కావడం సరైంది కాదని, ప్రజల ప్రయోజనాల కోసం సభకు హాజరై చర్చల్లో పాల్గొనాలని ఆయనను ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ లు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల భారత్ ప్రపంచ స్థాయిలో పోటీ పడే స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఐటి రంగంలో భారతీయులు, ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్లు ప్రపంచ కంపెనీల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు.
అయితే నేడు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, భవిష్యత్‌లో ఉద్యోగాలపై ప్రభావం ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.




