24 March, 2026 | 6:14 AM

హస్తం నేతలకు బంపర్ ఆఫర్!

24-03-2026 12:55 AM

సిద్దిపేట గడ్డలో హస్తం పాగా వేసేనా ?

సీఎం రేవంత్‌రెడ్డి కల నెరవేరేనా?

రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టేనా?

ఎమ్మెల్యేగా గెలపిస్తే మంత్రి పదవి అంటూ సీఎం ప్రకటన

సిద్దిపేట, మార్చి 23 (విజయక్రాంతి): సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చా రు. 2029 లో జరిగే ఎన్నికల్లో సిద్దిపేట ని యోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పద వి ఇస్తానంటూ ప్రకటించారు. అందుకు ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి దామోదర్ రా జనర్సింహ, హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు బా ధ్యత తీసుకుంటారని వెల్లడించారు.

అయితే సిద్దిపేట నియోజకవర్గం ఒకే కుటుంబం ఆధీనంలో ఉంటుందని ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం పై తమ ప్ర భుత్వానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. తమకు వివక్ష ఉండి ఉంటే నర్మెటలో ఆ యిల్ ఫామ్ పరిశ్రమ నిర్మించకుండా తమ ప్రాంతంలో లో ఏర్పాటు చేసుకునే వాళ్ళమని చెప్పారు. బి ఆర్ ఎస్ కంచుకోటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభోత్సవ సభ సక్సెస్ కావడం ఆ పార్టీ క్యాడర్లో జోష్ వచ్చిందంటూ చర్చ సాగుతుంది. 

ఏకతాటిపైకి వచ్చేనా...? 

సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతిసారి జరిగే ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలోని వెనుకబడి ఉంటా రు అనేది నగ్నసత్యం అంతకు మించితే కనీసం ప్రజలలో ఉండరు అనేది కూడా అంతే నిజం. అయితే పార్టీలో ఎవరి దారి వారిది, ఎవరి గ్రూపు వారిది, ఎవరి గాడ్ ఫాదర్ వారికే ఇలా విచిన్నంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బంపర్ ఆఫర్ తోనైనా ఏకతాటిపైకి వస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ని యోజకవర్గం కాదు కదా కనీసం జిల్లాలో కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాఖలాలు లేదు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు కేడెం లింగమూర్తికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి మినహాయిస్తే, నా మినేటెడ్ పదవులపై ఉసెత్తిన దాఖలాలు లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇకనైనా ఏకతాటిపైకి వస్తే అధికారం శాసించే అవకాశం ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 

రేవంత్ రెడ్డి కల నెరవేరేనా...

సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవాలనే సీఎం రేవంత్ రెడ్డి కళ నెరవేరేనా అది జరగాలంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపు రాజకీయాలకు, సీనియర్ జూ నియర్ నాయకత్వానికి స్వస్తి పలికితే తప్ప రేవంత్ రెడ్డి కళ నెరవేరదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ఇప్పటివరకు పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరు కూడా తిరిగి ప్రజాక్షేత్రంలో ఉండటం, కనిపించలేదని, కనీసం నాయకులకు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని ఇదే ప్రధానమైన సమస్య అంటూ చెబుతున్నారు. మంత్రి పదవి దక్కించుకోవాలంటే సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అంటూ ఆ పార్టీ కార్యకర్తలే సవాల్ చేసుకుంటున్నారు. ఎవరికివారుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తమ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.