12 June, 2026 | 1:59 AM

ముల్కనూర్ బస్టాండ్ ఆధునీకరిస్తాం

12-06-2026 12:52 AM

ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి

భీమదేవరపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బస్టాండ్‌ను ఆధునికరిస్తామని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముల్కనూర్ బస్టాండ్‌లోని సౌకర్యాలను పరిశీలించారు. భవిష్య త్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్ర త్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు. బస్టాండ్ ప్రాంగణం ముందు ఆ ర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు ప్రయాణికులకు ప్రత్యేకంగా రేకుల షెడ్లు వే స్తామన్నారు.    సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, ఊస కోయిల ప్రకాష్, ఆర్టీసీ కం ట్రోలర్ మాడుగుల ఈశ్వరయ్య, గణవేని కొమురయ్య, ముల్కనూర్ ఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.