12 June, 2026 | 1:22 AM

గడువు ముగిసినా ఆగట్లే!

12-06-2026 12:00 AM
  1. ఆగని మట్టి తరలింపు
  2. మట్టి మాఫియాకు అధికారుల అండదండలు 
  3. ఉదయం రాత్రి వేళల్లో అడ్డగోలుగా మట్టి సరఫరా 
  4. నియంత్రించాల్సిన అధికారులు ఎక్కడ..?

కరీంనగర్, జూన్ 11 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా మానేరు పరివాహక ప్రాంతాలలో గడువు ముగిసినా అక్రమంగా  చెరువు కుంటల నుంచి నల్ల మట్టి తరలిస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అనుచరులు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు ప్రముఖుల అనుచరులు మట్టి మాఫియా అవతారం ఎత్తడంతో అడ్డు అదుపు లేకుం డా మట్టి తరలింపు కొనసాగుతుంది. కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలో  మట్టి మాఫి యా యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తోంది.

500 నుంచి 1000 క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని అడ్డగోలుగా అక్ర మంగా ఎక్సవేటర్లతో మట్టిని తవ్వుతూ టిప్ప ర్లలో మట్టిని ఇటుక పార్టీలకు ఇతర వ్యాపా రాలకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. చిన్న నీటి వనరులైన చెరువుకుంటలను పరిరక్షించవలసిన నీటిపారుదల శాఖ అధి కారులు ప్రజా ప్రతినిధులల ఒత్తిడితో చెరు వు కుంటల వైపు రాలేదని ఆరోపణలు వస్తున్నాయి.

అదే విధంగా మరొక కొన్ని చెరు వుల మట్టి తరలింపునకు ఇంజ నీరింగ్ అధికారుల అండ దం డలతో వారి కణసన్నల్లో నల్లమ ట్టి సరఫరా అవుతుంది. చిన్న నీటి వరులను పరిరక్షించవలసిన ఇంజనీరింగ్ అధికారులు ప్రతి ఉదాసీనతతో వివరి స్తున్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతిని, ఇంజ నీరింగ్ అధికారుల అన్నదండలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. అదే విధంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగి స్తున్నారు.

స్థానిక చెరువులు, కుంటలు, వా గులు మరియు ఎర్రమట్టి గుట్టలను లక్ష్యం గా చేసుకుని భారీ యంత్రాలతో  అక్రమం గా మట్టిని తవ్వుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంన గర్ జిల్లాలోని  చొప్పదండి, రామడుగు, గంగాధర, జమ్మి కుంటా తదిత ర మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోం ది. ప్రభుత్వ అనుమతితో ఒక క్యూబిక్ మీటర్ మట్టిని తవ్వడానికి పరిమితమైన చలానా చెల్లిం చాలి. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి, అను మతించిన పరిమా ణానికి మించి వేలల్లో కీప్ మీటర్లలో ఎక్కువ మట్టిని తరలిస్తు న్నారు.

పగటిపూట ట్రాక్టర్ల ద్వారా మట్టిని సమీ పంలోని ప్రైవేట్ భూముల్లో డంప్ చేసి, రాత్రి వేళల్లో లారీలు మరియు టిప్పర్ల ద్వారా హైదరాబాద్ సహా ఇతర ప్రాంతా లకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన జలాశయాలు ప్రస్తుతం అక్రమ మట్టి దారులకు అడ్డగా మారాయి. 

నీటి నిల్వలు తగ్గి.. బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్లడమే ఆల స్యం.. ముంపు గ్రామాల భూములపై మట్టి మాఫియా పంజా విసురుతోంది. లోయర్ మానేరు డ్యాం, అప్పర్ మానేరు, మధ్య మానేరు జలాశయాల పరివాహక ప్రాంతా ల్లో రాత్రింబవళ్లు యదేచ్చగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొడుతు న్నప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్న అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఇటు ఇసుక బట్టీలకు, అటు రియల్ ఎస్టేట్ వెంచర్ల పూడిక పనులకు తరలిస్తూ రూపాయలు కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవలసిన నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల మధ్య కనీస సమన్వయం కరువైంది. ఏ శాఖను ప్రశ్నించినప్పటికీ.. మా పరిధిలోకి రాదు అంటూ కాలయాపన చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవకాశం అక్రమార్కులకు వరంగా మారింది.