కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం నిజం కాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సృష్టీకరణ
న్యూఢిల్లీ, జూన్ 11 (విజయక్రాంతి): టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం వార్తల్లో నిజం లేదని, అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల ఎంపీలతో రాజీనా మా చేయించి బీజేపీలో చేర్చుకోవడం ‘సీట్ చోరీ’ లాంటి విధానమేనని మండిపడ్డారు. చిలువలు పలువలుగా వస్తున్న ఆరోపణలపై గురువారం మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమి బలోపేతం చేయడంపైనే టీఎంసీ అధినేత్రి మమ తా బెనర్జీతో చర్చించామన్నారు. మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య దుస్థితిని చాటుతోంద న్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
దేశవ్యాప్తంగా దేశ ఆర్థిక దుస్థితి, ధరల పెరుగుదల, పరీక్షల సంక్షోభం వంటి వాటికి ప్రధాని మోదీనే బాధ్యులని విమర్శించారు. జూన్ నెలాఖరు నుంచి ఆం దోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 23 నెలలపాటు ఈ ఆందోళనలకు కొనసాగిస్తామన్నారు. ‘ఓట్ చోరీ, సీట్ చోరీ’ అనే డబుల్ ఇంజిన్ నినాదాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మరో సీనియర్ నేత జై రాం రమేష్ వ్యాఖ్యానించారు.






