ఇంటర్ సప్లిమెంటరీలో బాలికలదే హవా
- ఫస్టియర్‌లో 68.84 శాతం, సెకండియర్‌లో 49.29 శాతం ఉత్తీర్ణత
- మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీకి తెలుగులో 72 మార్కులు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాల్లో బాలికలదే హవా కన్పించింది. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం 68.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా, వీరిలో బాలికలు 76.10 శాతం పాసయ్యారు. సెకండియర్‌లో మొత్తం 49.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వీరిలో బాలికలు 52.56 శాతం అర్హత పొందా రు. మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ ప్రతిభ చాటారు. ఆయన తెలుగు సబ్జెక్టులో 72 మార్కులతో సెకండియర్ పాస్ అయ్యారు.
ఇంటర్ సప్లి మెంట్ ఫలితాలను గురువారం నేరుగా కాకుం డా ఆన్‌లైన్‌లో ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 13 నుంచి మే 21వ తేదీ వరకు జరిగిన ఇంట ర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలకు మొత్తం 3,98,459 మంది హాజరయ్యారు. అందులో ఫస్టియర్ విద్యార్థులు 2,67,331 మందికి 1,84,042 (68.84 శాతం) మంది పాసయ్యా రు. బాలికలు 94,343 (76.10 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 89,698 (62.57 శాతం) మంది పాసయ్యారు.
సెకండియర్ విద్యార్థులు మొత్తం 1,31,128 మంది పరీక్షలు రాయగా, 64,639 (49.29 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 24,910 (52.56 శాతం) మంది పాసైతే, బాలురు 39,729 (47.45 శాతం) మంది పాసయ్యారు. ఫస్టియర్ జనరల్ స్ట్రీమ్‌లో 2024లో 63.82 శా తం, 2025లో 67.36 శాతం, 2026లో 68.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్‌లో 2024లో 43.79 శాతం, 2025లో 50.96 శాతం, 2026లో 47.70 శాతం మంది పాసయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో 91.26 శాతం తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి స్థా నంలో నిలవగా, 88.33 శాతంతో ములుగు జి ల్లా ఇంటర్ సెకండియర్‌లో టాప్‌లో నిలిచింది.
ప్రతిభ చాటిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ప్రతిభ చాటారు. దశాబ్దాల క్రితం వదిలేసిన చదువును ఇప్పుడు మళ్లీ మొద లు పెట్టారు. ఇటీవల జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్టు పరీక్ష రాసి 72 మార్కులతో పాసయ్యారు. దీంతో ఇంటర్మీడియట్‌లో మొత్తం 614 మార్కులు సాధించారు. గతంలో తెలుగు సబ్జెక్ట్‌లో ఆయన తప్పడంతో ప్రత్యేక అనుమతితో మళ్లీ పరీక్షరాశారు. దీంతోపాటు ఇటీవల రాసిన లాసెట్‌లో కూడా 349 ర్యాంకును ఆయన సాధించారు.






