21 April, 2026 | 4:42 AM

నిధుల వినియోగంలో తప్పిదాలు జరగనివ్వద్దు

21-04-2026 03:11 AM

వెల్దండ ఏప్రిల్ 20: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధుల వినియోగంలో తప్పిదాలు జరగనివ్వరాదని ఎంపీడీవో కృష్ణయ్య సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలసర్పంచ్ లకు, ఉప సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు.

మంజూరవుతున్న నిధులను మౌలిక వసతి సౌకర్యాలు కల్పించడం కోసం, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని అవసరమైన పనులపై ముందుగానే గ్రామ సమావేశం నిర్వహించి చర్చించి తీర్మానాలు చేసి పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు ఎంపీఓ లక్ష్మీ నాయక్ అధికారులు పాల్గొన్నారు.