15 June, 2026 | 1:29 AM

క్యూబన్ విప్లవ నిప్పుకణిక చేగువేరా

15-06-2026 12:26 AM
  1. కార్మికుల హక్కుల కోసం రైతుల కోసం సామ్రాజ్యవాద దోపిడీని ఎదిరించిన నేత                  
  2. జవహర్‌నగర్ డివిజన్ సీపీఎం కార్యదర్శి శివన్నారాయణ                 

జవహర్‌నగర్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రపంచ ఉద్యమాలకు గెరిల్లా నాయకుడు క్యూబన్ విప్లవంలో నిప్పు కనిక కార్మికుల హక్కుల కోసం రైతుల కోసం సామ్రాజ్యవాద దోపిడీని ఎదిరించిన గొప్ప విప్లవ యోధుడు చేగువేరా నేనని జవహర్ నగర్ డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి శివన్నారాయణ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ అంబేద్కర్ నగర్లో ఆదివారం సిఐటియు ఆఫీస్ ప్రాంగణంలో ప్రపంచ విప్లవ కెరటం యువకులకు ఐకాన్ గా నిలిచిన చేగువేరా 98వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జవహర్ నగర్ డివిజన్ కార్యదర్శి శివన్నారాయణ హాజరై సిఐటియు సీనియర్ నాయకులు వెంకటాద్రి తదితరులు చేగువేరా చిత్రపటానికి వందనం సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చేగువేరా ప్రపంచ విప్లవ కెరటంగా సామ్రాజ్యవాద శక్తులకు చిచ్చరపిడుగుగా నిలిచారని తెలిపారు. ఫిడెల్ క్యాస్ట్రో తో కలిపి క్యూబా విప్లవాన్ని జయప్రదం చేయడంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. చేగువేరా స్వయంగా డాక్టర్ అయినప్పటికీ ప్రజల్లో నిరంతరం సేవ చేస్తూ ఉండేవారని తెలిపారు.

ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉండి పేదలకు ఎంతో వైద్య సేవలు చేశాడని తెలిపారు. భారతదేశానికి వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారని తెలిపారు. తర్వాత కాలంలో క్యూబాకే పరిమితం కాకుండా లాటిన్ అమెరికా దేశాలలో విప్లవాలను జయప్రదం కావాలని ముందుకు సాగారని పేర్కొన్నారు. బొలివియాలో అమెరికా సైనికులకు చిక్కి హతమయ్యారని పేర్కొన్నారు. 39 సంవత్సరాలు జీవించినప్పటికీ ప్రపంచ విప్లవకారులకు ఆయన ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి, నాగేష్, అశోక్, వేణు, బాలు తదితరులు పాల్గొన్నారు.