15 June, 2026 | 1:26 AM

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయలు కల్పించాలి

15-06-2026 12:26 AM

బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్

బోధన్, జూన్ 14 (విజయక్రాంతి): నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. 

బోధన్ పట్టణంలో గల  పి,ఆర్,టి,యు భవన్ లో ఆదివారం రోజున విద్యార్థి సంఘాల  జెఎసి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల జెఎసి నాయకులు ఎన్. బాల్ రాజ్, ఎం డి మోషిన్ లు మాట్లాడుతు... రేపటి నుండి నూతన విద్య సంవత్సరం ప్రారంభం కాబోతుంది కావున ప్రభుత్వ విద్య సంస్థల్లో చదవబోయే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చూడాలి.

అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ యూనిఫారాంలు వెంటనే సకాలంలో అందించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలి. నాణ్యమైన మధ్యన భోజనాన్ని ఏర్పాటు చేయాలని... విటన్నిటిని విద్యాశాఖ అధికారులు ఎప్పటికి అప్పుడు పర్యవేక్షణ నిర్వహించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

అదేవిధంగా జిల్లా మరియు డివిజన్ స్థాయిలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి.అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవం మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్య బోధన నిర్వహించాలి.ప్రతి తరగతికి సరిపడా కామన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలి.

ప్రతి ప్రైవేట్ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలి.ప్రైవేట్ విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫారంలు, బూట్లు లాంటి అమ్మకాలు పాఠశాలల యాజమాన్యాలు జరుపకుండా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఎక్కడ సమస్లు తలెత్తిన విద్యార్థి సంఘాలుగా మేము ఎప్పటికప్పుడు ఏదిరిస్తూ విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ  నాయకులు తల్లారి సంజయ్, డి. కిరణ్,రాజన్న, మోహన్, ప్రశాంత్, రాజు లు పాల్గొన్నారు.