15 June, 2026 | 3:04 AM

ప్రతిభను ప్రోత్సహిస్తేనే సమాజం అభివృద్ధి

15-06-2026 01:52 AM

రాష్ట్రవ్యాప్తంగా విద్యాభివృద్ధికి సేవలు విస్తరిస్తాం

సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు

సొంతూరు తుమ్మనపేటలో 181 మంది విద్యార్థులకు నగదు బహుమతులు 

అచ్చంపేట, జూన్ 14 (విజయక్రాంతి): ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ర్టంలో రెండవ స్థానంలో ఉండటం గర్వకారణమని.. ఇదంతా ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సినీ నటుడు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

ఆదివారం బల్మూరు మండలం తుమ్మనపేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అచ్చంపేట నియోజకవర్గం పరి ధిలోని 45 ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10, 9వ తరగతికి చెందిన 181 మంది విద్యార్థులకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక బహుమతులను విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులు అందజే శారు. ప్రథమ బహుమతి రూ.పది వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు అందజేశారు.

వారి వివాహ రిసెప్షన్ సందర్భంగా విద్యార్థులకు తమ వంతు సహాయం అందిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కష్టపడి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, గురువులే విద్యార్థులకు అసలైన ప్రేరణ అని.. క్రమశిక్షణతో పాటు సామాజిక బాధ్యత  విద్యార్థుల్లో పెంపొందించాలని అన్నారు.

తాను తల్లిదండ్రుల ప్రేరణతోనే ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. పుట్టి న గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో అ చ్చంపేట నియోజకవర్గంలోని  విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో ఈ సేవలను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విస్తరించనున్నట్లు హామీ ఇ చ్చారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువుల కృషిని గుర్తించి కష్టపడి చదివి కుటుం బానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

కొన్నిసార్లు ఫెయిల్ అయిన వాటిని ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్లాలని అభిలాషించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా అభినందించారు. పుట్టిన ఊరులో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కొనియాడారు. విద్యకు చేయూతనందిస్తున్న విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ప్రశంసించారు.

నియోజకవర్గంలోని ఏదైనా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ హనీ హంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని కోరారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ.. గట్టు తుమ్మన్ ప్రాంతానికి చెందిన తాను చిన్నారులపై ప్రేమతోనే సా మాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో విజయ్ దేవర కొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధ వి, డీఈవో రమేష్ కుమార్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.