26 April, 2026 | 6:08 AM

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు

26-04-2026 12:00 AM

కుషాయిగూడ, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టు సముదాయంలో కోర్టు విధులను అడ్డుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు జే. కృష్ణ నాలుగవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి కోర్టులో ప్రాసెస్ సర్వర్గా విధులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం బెంచ్ క్లర్క్గా పనిచేస్తున్నారు.

ఇటీవల మధ్యాహ్నం సమయంలో కుషాయిగూడలోని మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి కోర్టులో ఇన్చార్జ్ విధులు నిర్వహిస్తు న్న సమయంలో, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఒక కేసులో నిందితుడైన బి. సురేష్ను కోర్టుకు హాజరుపరిచారు. అతన్ని ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది కోర్టు ముందు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిందితుడు తనను అనవసరంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కోర్టు హాల్లో అసభ్య పదజాలంతో ప్రవర్తించి, కోర్టు విధులకు ఆటంకం కలిగించాడు.

వెంటనే ఎస్కార్ట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. కోర్టు విధులకు భంగం కలిగించడం, కోర్టు అధికారు లపై అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి కారణాలతో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని కుషాయిగూడ స్టేషన్ హౌస్ అధికారి ఎల్. భాస్కర్ రెడ్డి తెలిపారు.