26 April, 2026 | 4:26 AM

మహిళా సంఘాలకు రుణాల పంపిణీ

26-04-2026 12:00 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్ నెలలో  30 సంఘాలకు రూ. 1.12 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ డిప్యూటీ కమిషనర్  బి. శ్రీనివాస్ పంపిణీ చేశారు. మహిళలు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

అనంతరం యూసీడీ, యూబీడీ విభాగాల ఆధ్వర్యంలో పార్కు ల నిర్వహణ పై సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ స్వయం సహాయక  సంఘాల మహిళలకు యూబీడీ డైరెక్ట ర్ సునంద రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఎం.విక్రాంత్ రెడ్డి,  ఐసీఐసీ ఐ బ్యాంక్ మేనేజర్ జగదీశ్, యూసీడీ సీవోలు  కృష్ణవేణి, సైదులు, సహదేవ్, నర్సింగ్ రావు, వెంకటేశ్, రాకేశ్ కుమార్, శోభన, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.