సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
డీసీపీ రమణారెడ్డి
జూబ్లీహిల్స్,ఏప్రిల్ 15(విజయక్రాంతి): మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ్ నగర్లో గల శ్రీమారుతి నీరజ్ గ్రాండెవర్ వద్ద భారీ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వాని తులుగా హాజరైన జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతికతతో పాటు సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు.
ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు.రోజువారీ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సైబర్ ఫ్రాడ్స్, అపరిచిత లింకులు, ఓటీపీ షేరింగ్ వల్ల జరిగే నష్టాలను ఆయన వివరించారు.అదనపు డీసీపీ కే శ్రీకాంత్, మధు రానగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఇతర అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డీఐ శ్రీనివాస్, ఎస్త్స్రలు సుష్మ, భాను చందర్, శివ శంకర్, జెడ్.సి.సి టీమ్, బీసీ-3, కార్-2 సిబ్బందితో పాటు సైబ ర్ వారియర్స్, స్థానికులు పాల్గొన్నారు.






