20 March, 2026 | 5:43 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

విద్యార్థులకు మజ్జిగ పంపిణీ

19-03-2026 12:00 AM

బెజ్జూర్ మార్చి 18 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో 10వ తరగతి విద్యార్థులకు మాజీ జెడ్పిటిసి పంద్రం పుష్పలత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న క్రమం లో ఆకలి దప్పికను తీర్చే ఉద్దేశంతో సేవా భావంతో విద్యార్థుల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయ డం అభినందనీయమని సర్పంచ్ పద్మ, సోయం చిన్నయ్య,ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ అన్నారు.

పదవి ఉన్న లేకున్నా ప్రజాసేవలో ఉండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మాజీ జెడ్పిటిసి పందరం పుష్పలతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సుగుణ, లింగయ్య, నాయకులు లక్ష్మి, శంకర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.