10 May, 2026 | 9:31 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

డివిజన్ల విభజన గందరగోళం

15-12-2025 04:07 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజన ముసాయిదాపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. తలసాని ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కు వినతిపత్రం అందించారు. డివిజన్ల పునర్విభజనలోని తప్పిదాలను సరిచేయాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన గందరగోళంగా చేశారని, డివిజన్ల పునర్విభజనలో తొందరపాటు ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా డివిజన్లు విభజించడం తప్పు అన్నారు.