6 June, 2026 | 4:39 PM

Breaking News

వికారాబాద్‌లో ఘోరప్రమాదం.. హోటల్ స్లాబ్ కూలి ఒకరు మృతి   •   హైదరాబాద్‌లో భారీ వర్షం   •   ధాన్యం అన్‌లోడ్ ఆలస్యం.. రాజీవ్ రహదారిపై రైతుల బైఠాయింపు   •   అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు   •   Phone Tapping Case: కేసీఆర్‌పై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు   •   బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్   •   అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి   •   ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి   •   మంథని టీజీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక   •  

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా

06-06-2026 03:15 PM

భిక్కనూర్, జూన్ 6(విజయక్రాంతి): భిక్కనూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు, తరలింపు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లపై పూర్తి వివరాలు వెల్లడించాలని తహశీల్దార్ సునీతను డిమాండ్ చేశారు.

ధర్నా సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , తహశీల్దార్ సునీతతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని 48 గంటల్లో పూర్తిగా తరలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.