6 June, 2026 | 4:40 PM

Breaking News

వికారాబాద్‌లో ఘోరప్రమాదం.. హోటల్ స్లాబ్ కూలి ఒకరు మృతి   •   హైదరాబాద్‌లో భారీ వర్షం   •   ధాన్యం అన్‌లోడ్ ఆలస్యం.. రాజీవ్ రహదారిపై రైతుల బైఠాయింపు   •   అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు   •   Phone Tapping Case: కేసీఆర్‌పై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు   •   బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్   •   అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి   •   ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి   •   మంథని టీజీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక   •  

నిరుపేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

06-06-2026 03:13 PM

ఘట్ కేసర్, జూన్ 6 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో సోషల్ కనెక్ట్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సీఈఓ ఎం. హేమ సహకారంతో నిరుపేద పిల్లలకు బట్టలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాగ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు 

ఈకార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొని చిన్నారులకు అవసరమైన వస్త్రాలు, ఆహార పదార్థాలను అందజేశారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని డాక్టర్ మల్లేష్  పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో మానవతా విలువలు, సేవాభావాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమం ద్వారా చిన్నారుల ముఖాల్లో ఆనందం నింపడంతో పాటు, సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని విద్యార్థుల్లో మరింత అందిస్తుందని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.