నాభి శిల బొడ్రాయి ప్రాణ ప్రతిష్ఠ
- అంగరంగ వైభవంగా ఉత్సవాలు
కొండపాక: కుకునూరుపల్లి మండల కేంద్రంలో సోమవారం నాభి శిల (బొడ్రాయి) ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని వందల ఏళ్ల నాటి పురాతన నాభి శిలను వెలికితీసి, గ్రామ నడిబొడ్డున నూతన నాభి శిల, పోతలింగేశ్వర స్వామి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. పాండురంగ ఆశ్రమ గురువులు విఠల్ శర్మ పర్యవేక్షణలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య యంత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లం కనుకవ్వ ఐలయ్య, ఉప సర్పంచ్ దోంతి సత్తయ్య, మాజీ సర్పంచ్ కాసం నవీన్ కుమార్, పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్, పాక్స్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, మాజీ ఎంపిటిసిలు ఇండ్ల కనకయ్య , భూరమైన భూములు గౌడ్ ఇతర ప్రజాప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు.






