పది మండల టాపర్ కు రవీంద్ర భారతిలో సన్మానం
11-05-2026 07:48 PM
పాపన్నపేట: హైదరాబాదులో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే ప్రతిభా పురస్కారానికి చికోడ్ లింగాయిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి వెల్లడించారు , ఇందులో భాగంగా సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డిని ప్రముఖులు సన్మానించారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో హర్షవర్ధన్ రెడ్డి పాపన్నపేట మండల్ టాపర్ గా నిలిచాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్ గా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సోమవారం రవీంద్రభారతిలో సన్మానం నిర్వహించినట్లు పాఠశాల గజిటెడ్ హెడ్మాస్టర్ విజయలక్ష్మి వివరించారు.






