పోచమ్మ బోనాల తొట్టెల మహోత్సవానికి సింగిరెడ్డి ఆహ్వానం
30-07-2026 04:43 PM
మాజి సర్పంచ్ భేరి ఈశ్వర్
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మతల్లి పండుగ బోనాల తొట్టెల మహోత్సవానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని ముఖ్య అతిథిగా గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ బేరీ ఈశ్వర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ డివిజన్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్.యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిల రాఘవేందర్ రెడ్డి.సంపత్ యాదవ్.తదితరులు పాల్గొన్నారు.






