30 July, 2026 | 5:31 PM

Breaking News

మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •  

స్కావెంజర్స్ వేతనం పెంచాలి

30-07-2026 04:33 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో స్కావెంజర్ కార్మికులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ.. స్కావెంజర్స్ కార్మికులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రభుత్వం తక్షణమే కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వారు పనిచేస్తున్న పాఠశాలల్లో ప్రతిరోజూ హాజరు నమోదు చేసే విధానాన్ని అమలు చేయడంతో పాటు, కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా 15 మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గంగాధర్, జిల్లా అధ్యక్షుడిగా నారాయణ, జిల్లా కార్యదర్శిగా మల్లేష్, జిల్లా కోశాధికారిగా పోశెట్టి, ఉపాధ్యక్షురాలిగా లలిత, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, సభ్యులుగా రాధా, దామియా, రేణుక, సురేష్, గంగవ్వ, సానియా బేగం, రాజవ్వ, రాణి, రాజేశ్వర్, పోశెట్టిలను ఎన్నుకున్నారు.