30 July, 2026 | 5:32 PM

Breaking News

మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •  

వర్షాకాలం పారిశుధ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

30-07-2026 04:36 PM

బోథ్,(విజయక్రాంతి): వర్షాకాలం ప్రజలుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని దేవుళ నాయక్ తండ గ్రామంలో గ్రామ సర్పంచ్ బాబు సింగ్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అంతేగాక ప్రజలను పరిశుద్ధంపట్ల అప్రమత్తంగా ఉండే విధంగా గ్రామ కార్యదర్శి పంచాయతీ పాలకవర్గం వారు సూచించాలన్నారు.

పారిశుద్ధ కార్మికులు మురికి కాల్వలను శుభ్రం చేసిన తర్వాత చెత్తను సాధ్యమైనంత తొందరలోనే రోడ్లపై నుండి తొలగించాలని సూచించారు. పాఠశాలలో న్యూట్రి గార్డెన్ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించి పిల్లలకు పోస్టుగారం అంది విధంగా చూడాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రమైన నీటిని పాడాలని మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. సమావేశంలో గ్రామంలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.