30 July, 2026 | 5:06 PM

వ్యాధులు ప్రబలకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలి

30-07-2026 03:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): అధికంగా వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలను చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ సిబ్బందికి ఆదేశం ఆదేశించారు. ఈ రోజు  జూమ్ మీటింగ్ ద్వారా వైద్యాధికారులతో మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఆరోగ్యపరంగా ఇటువంటి ఇబ్బంది ఉన్న సేవలందించేందుకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కోరారు.

 ముఖ్యంగా అధిక వర్షాల వల్ల రోడ్డు మార్గం తెగిపోయే గ్రామాలలో ఉన్న గర్భవతులను బర్త్  వెయిటింగ్ రూమ్స్ కు తరలించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి రాపిడ్  రెస్పాన్స్ బృందాన్ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిద్ధంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలియజేశారు.