బీఎల్‌వోలు సక్రమంగా పనిచేస్తలేరు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో) సరిగ్గా పనిచేయటం లేదని, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) కో కమిటీ సభ్యులు కర్నె ప్రభాకర్, ఎల్ రమణ, సుమిత్రానంద్, సతీష్ రెడ్డి, అభిలాష్ రంగినేని మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభావకర్ మీడియాతో మాట్లాడుతూ.. సర్ కార్యక్రమంపై టెక్నికల్‌గా పలు అనుమానాలు ఉన్నాయని, కొన్ని ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం రాలేదన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లో లోటుపాట్లు ఉన్నాయని, సందేహాలు నివృత్తి కాక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సర్‌కు సమయం సరిపో దని, పొడిగించాలి కోరారు.
సీఎం పదవి నుంచి తప్పించాలి: మాజీ ఎమ్మెల్య్ బొల్లం మల్లయ్య
రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను బెదిరిస్తున్నార ని, ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన తెంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి భాష, వ్యవహార శైలి ఉగ్రవాది కంటే దారుణంగా ఉందన్నారు. హరీశ్‌రావుకు రేవంత్‌రెడ్డి శిష్యుడని.. హరీశ్‌రావు విజయోత్సవ ర్యాలీలో డ్యాన్స్ చేసిన విషయం రేవంత్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలర్ అని, ఆయనకు నేర చరిత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ చావును రేవంత్‌రెడ్డి కోరుకున్నారని ఆయన మండిపడ్డారు.






