గుడిసెలు లేని జిల్లానే లక్ష్యం..
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి
- మొదటి విడత లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
కొల్చారం, జూన్ 14ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హ పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే లక్ష్యమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొ ల్చారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని హౌసింగ్ పీడీ మా ణిక్యం, తహసీల్దార్ శ్రీనివాస చారి, ఎంపీడీవో రహీమున్నీసా బేగం, సర్పంచ్తో కలిసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రెండో విడతలో ప్రాధాన్యత పొంద నున్న గుడిసెల ధ్రువీకరణ, మొదటి విడత ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు సమ న్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరై సంవత్స రం పూర్తవుతున్నా ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంట నే పనులు ప్రారంభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెండో విడతలో కూడా జిల్లాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకానున్న నేపథ్యంలో మొదటి విడత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని స్పష్టం చేశారు.జిల్లాలో మొదటి విడ తలో 9 వేల ఇళ్లు మంజూరయ్యాయని, ప్ర స్తుతం 83 శాతం నిర్మాణ పురోగతి నమోదైందని కలెక్టర్ తెలిపారు.
ఇప్పటివరకు 1, 700 ఇళ్లు పూర్తు గృహప్రవేశాలు జరిగాయ ని, 2,400 ఇళ్లు స్లాబ్ పూర్తు ఫినిషింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. మరో 650 ఇ ళ్లు రూం లెవెల్లో, 1,400 ఇళ్లు బేస్మెంట్ దశలో ఉండగా, మిగిలినవి పునాది దశలో ఉన్నాయని వివరించారు. ఇంకా 1,600 మంది లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించలేదని, వారిలో అవగాహన కల్పించి వెం టనే పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మ హిళా సంఘాల ద్వారా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రెండో విడత ఇందిర మ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో గుడిసెల సర్వే పూర్తయిందని, గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నిజమైన అర్హులను గుర్తించి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నా రు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో. ఎమ్మా ర్వో శ్రీనివాస చారి. సర్పంచ్ దేవన్న గారి శేఖర్. పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్. ఆర్ ఐ సుమలత. మహేశ్వర్ రెడ్డి. హౌసింగ్ ఏఈ సుష్మ. తదితరులు పాల్గొన్నారు.






