15 July, 2026 | 12:28 AM

సర్ గడువు పొడిగించాలి

15-07-2026 12:28 AM
  1. హైదరాబాద్‌లో 21 శాతమే పూర్తి
  2.   10 రోజుల్లో సవరణ కష్టమే
  3. టీఎస్‌సీఈఓ సుదర్శన్‌రెడ్డికి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్  కోరారు. రాష్టంలో సర్ ప్రక్రియం వేగంగా సాగడం లేదని, ప్రధానంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసన సభ నియోజకవర్గాల్లో నత్తనడకన సాగుతుందని మంత్రి పొన్నం తెలిపారు.

మంగళవారం బీఆర్‌కే భవన్‌లో ఎస్‌ఈవో సుదర్శన్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ , నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ రాజేష్, ఇతర ముఖ్య నేతలు కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో సగటున 21 శాతం ఓటరు సవరణ ప్రక్రియ మాత్రమే పూర్తయిందని, ఇంకా 10 రోజులు  సమయం మాత్రమే ఉన్నందున ఆ గడువును పొడిగించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నా యి. అర్బన్‌లో ఓటరు సవరణ సరిగా జరగడం లేదన్నారు.

హైదరాబాద్‌లో విద్యార్థుల భాగస్వామ్యం తీసుకోవాలని కోరామన్నారు. బీఎల్‌వోలు ఇళ్లలోకి రావడం లేదని, ఫారాలు కూడా సరిగా సరిగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్‌వోలకు ఎలాంటి సమస్య లేకుండా పేమెంట్ కూడా చేశారని తెలిపారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాన్నారు.

బీఎల్‌లోవోలకు  క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తున్నా యని,  హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ లు, ప్రభుత్వ టీచర్లు, జీహెచ్ ఎంసీ సహకారం తీసుకోవాలని కోరుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్‌లో తమ  క్యా డర్ కూడా ఈ 10 రోజులు అందరి భాగస్వా మ్యం కావాలని చెప్పామన్నారు.