18న ఛలో సరూర్‌నగర్
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు
ఏర్పాట్లను పరిశీలించిన నేతలు
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జూలై 18న బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఈ సదస్సు ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం పరిశీలించారు.
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పేరిట యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
ఈ బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు స్థలాన్ని పరిశీలించిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నోముల భగత్, నాయకులు బంటి, అవినాష్ రెడ్డి, ముఠా జై సింహా, బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.






