calender_icon.png 7 February, 2026 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపి ఎస్సీలకు అధిక ప్రాధాన్యతని ఇస్తుంది

06-02-2026 08:38:14 PM

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఎస్సీలకు సంబంధించిన వివిధ వార్డులలో పర్యటించి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీలకు సంబంధించిన వివిధ వార్డులలో పర్యటించి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగా చిట్యాల పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 11 మంది అభ్యర్థులలో ఆరుగురు ఎస్సీలకు అవకాశం ఇచ్చిన పార్టీ ఎదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి అంటే బీజేపీ, బీజేపీ అంటే అభివృద్ధి అని, అందుకే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు గెలిపించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ మాజీ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, భువనగిరి మాజీ పార్లమెంటు కన్వీనర్ పట్టణ ఇంచార్జీ బండారపు లింగాస్వామి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, ఎస్సీ మోర్చ మాజీ కార్యదర్శి మాస శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పబ్బు వెంకన్న, కంబాలపల్లి సతీష్, ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చినేని జాని, మాజీ పట్టణ అధ్యక్షులు కూరెళ్ళ శ్రీనివాస్, పోటి చేస్తున్న అభ్యర్థులు రుద్రవరం లింగాస్వామి, గంజి గోవర్దన్, నాగరాజు, సుంచు శ్రీలత శ్రీను, చికిలం మెట్ల అశోక్, జయరపు రామక్రిష్ణ, పల్స శ్రీను తదితరులు పాల్గొన్నారు.