06-02-2026 08:34:26 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ విభాగం నిర్వహిస్తున్న 30 గంటల ప్రతిష్ఠాత్మక స్మార్ట్ పవర్థన్ 2K 2026ను శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ హ్యాకథాన్‌కు 300కు పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడం విశేషం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతారాం తాడేపల్లి, ఇండస్ట్రీ రిలేషన్స్ చైర్ ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్, గెస్ట్ ఆఫ్ హానర్ కులదీప్ మగిరి మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. విజయకుమార్ డీన్ స్కూల్ అఫ్ ఇంజినీరింగ్, డా.టి. అనిల్ కుమార్ విభాగాధిపతి హాజరు అయ్యారు. ఈకార్యక్రమం ద్వారా విద్యా రంగం పరిశ్రమల మధ్య సహకారం స్పష్టంగా ప్రతిఫలించింది. ఈసందర్భంగా అతిథులు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు, విభిన్న శాఖల సమన్వయంతో జరిగే సహకారం (ఇంటర్‌డిసిప్లినరీ కొలాబరేషన్), ప్రాయోగిక నైపుణ్యాల అభివృద్ధి ప్రాధాన్యతను వివరించారు.