ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు
01-06-2026 10:55 AM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడిగా బిల్లా కంటి హరిబాబు ఎన్నికల్లో విజయం సాధించాడు. వారి ప్రత్యర్థి వాసా రమేష్ పై 135 ఓట్ల మెజారిటీ ఆధిక్యం సాదించాడు. ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆర్యవైశ్య మహాసభ జిల్లా కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికల మాదిరి ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. మందు విందులతో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో బిల్ల కంటి హరిబాబు అనూహ్య విజయం సాధించారు.






