30 July, 2026 | 10:35 PM

తీజ్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

30-07-2026 09:31 PM

భూపాలపల్లి/శాయంపేట,(విజయక్రాంతి): శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో స్థానిక గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన తీజ్ వేడుకలకు భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన సోదర, సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.