1 June, 2026 | 12:01 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ

01-06-2026 10:54 AM

ఇల్లెందు, (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి ఇల్లందు ఏరియాలో ఆటలు, పాటల పోటీలు 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహిళా ఉద్యోగులు, వైసీఓఏ క్లబ్ సభ్యులు, సేవా సమితి సభ్యులు, ట్రైనర్ల కోసం వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో మహిళా ఉద్యోగులకు ఆటల-పోటీలను నిర్వహించగా, ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అలాగే సీఆర్ క్లబ్‌లో సేవా సమితి సభ్యులు మరియు ట్రైనర్ల కోసం ఆటల-పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు మహిళలు చాలా  ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిబాను కనబరిచారు. అనతరం వైసీఓఏ క్లబ్ సభ్యులకు సేవ అధ్యక్షురాలు వి.రమ పాల్గొని ఈ ఆటల-పోటీలను ప్రారంబించారు.

ఈ సందర్బంగా సేవ అధ్యశురాలు శ్రీమతి వి.రమ మాట్లాడుతూ.. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకలలో  బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో సీనియర్ పర్సనల్ అధికారి వరిపల్లి అజయ్, సేవా సమితి కో-ఆర్డినేటర్ బి.కోట సాంబయ్య, మహిళా ఉద్యోగులు, వైసీఓఏ క్లబ్ సభ్యులు, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.