calender_icon.png 22 February, 2026 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగరిలో భోగి యాక్షన్

22-02-2026 12:00:00 AM

సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’తో అలరించిన శర్వానంద్ ఇప్పుడు తొలిసారిగా యాక్షన్ స్పెషలిస్ట్ సంపత్ నందితో కలిసి ‘భోగి’ అనే భారీ పాన్-ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. టీమ్ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అందులో శర్వా, ఇతర నటీనటులతో కొన్ని టాకీ పార్ట్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

ఈ కీలక షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను వేశారు. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉండగా, వాటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొననున్నారు. 1960 నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు, హై వోల్టేజ్ డ్రామాతో నిండిన కథతో రూపొందుతోందీ చిత్రం.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: కిషోర్ కుమార్ ఆరోకియా; ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె.