4 May, 2026 | 2:11 AM

రైతుల సమస్యలే ప్రధాన ఎజెండా

04-05-2026 12:47 AM
  1. కలెక్టరేట్ల ముట్టడి, ధర్నాలను బీఆర్‌ఎస్ చేపట్టాలి
  2. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాడాలి
  3. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
  4. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ
  5.   6న వరంగల్ సభ నేపథ్యంలో కీలక సమావేశం

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మరోకీలక పరిణామం చోటుచేసుకుంది. రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్ తీసుకోవాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అన్నదాతలకు మద్దతుగా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలను చేపట్టాల ని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాడాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు దిశానిర్దేశం చేశారు. 6న నిర్వహించనున్న వరంగల్ సభ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావుతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో ముఖ్యంగా రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ఈనెల 6న వరంగల్‌లో రైతు సభ నిర్వహించినున్న క్రమం లో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సభలో ప్రసంగించాల్సిన పలు అంశాలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చర్చించినట్టు తెలిసింది. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ధాన్యం కొనుగోళ్లలో వైఫ ల్యం, పంటల కనీస మద్ద తు ధరలు, సాగునీటి ఇబ్బందులు, రుణభారం వంటి అంశా లు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో రైతు సమస్యలను ప్రజా ఎజెండాగా మార్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరంగల్ సభ వేదికగా రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగం గా జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాయకత్వాన్ని యాక్టివ్ చేస్తూ, రైతు సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమం చేపట్టే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై రాజకీయ దాడికి మరింత పదును పెట్టడంపై కూడా ఈ సమావేశంలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లో బలంగా చాటిచెప్పాలని, అన్ని వేదికలపై ఈ అంశాన్ని హైలెట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ భేటీతో బీఆర్‌ఎస్ మళ్లీ ఉద్యమాల దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతు సమ స్యలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం మీద రాజకీయంగా ఒత్తిడి పెంచే వ్యూహంతో పార్టీ ముందుకు సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.