11 July, 2026 | 2:07 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

నిర్దేశిత కక్షలోకి ‘దృష్టి’

04-05-2026 12:20 AM
  1. కక్షలోకి ఆప్టో-సార్ ఉపగ్రహం
  2. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ కొత్త రికార్డు 

న్యూయార్క్, మే ౩: భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘గెలాక్సీ ఐ’ రూపొందించిన ‘మిషన్ దృష్టి’ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని స్పేస్‌ఎక్స్ ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భారత్ నుంచి ప్రైవేట్ రంగంలో తయారైన అతిపెద్ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌గా రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే మొదటిసారిగా ఆప్టికల్ కెమె రా, సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఆప్టోసార్) సాంకేతికతతో ప్రయోగించడం దీని ప్రత్యేకత. ఈ సాంకేతికతతో అంతరిక్షంలో వాతావరణం ఎలా ఉన్నా దూరం నుంచి భూమికి సంబంధించిన చిత్రాలు తీయడం సాధ్యమవుతుంది. సాధారణ ఉపగ్రహాలు మేఘాల చాటున ఉన్నా లేదా చీకటిలో ఉన్నా స్పష్టమైన ఫొటోలు తీయలేవు.

కానీ, ఆప్టో-సార్ సాంకేతికత ఆ అడ్డంకులను అధిగమించి హై-రెజల్యూ షన్ (హెచ్‌డీ) చిత్రాలను అందిస్తుంది. ఉపగ్రహం ద్వారా వచ్చే డేటాతో వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగాలకు విశిష్ట సేవలు అందుతాయి. మరోవైపు, ఈ విజయంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) హర్షం వ్యక్తం చేసింది. అలాగే ‘గెలాక్సీ ఐ’ బందాన్నీ అభినందించింది.