calender_icon.png 22 February, 2026 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు హీరో..?!

22-02-2026 12:00:00 AM

ఇండియన్ సినిమా లెజెండ్స్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు రజనీకాంత్, కమల్‌హాసన్. వీరు కలిసి నటించే సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. వీరిద్దరి కలిసి నటించనున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ఇది.

ప్రస్తుతం ‘కేహెచ్‌xఆర్‌కే’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ శనివారం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు పోటాపోటీగా స్టులిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ఎవరు హీరో?’ అంటూ వీరిద్దరూ అడగటం ఫన్నీగా అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘జైలర్’ వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను అందించిన నెల్సన్ దిలీప్‌కుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

రజనీ, కమల్ 70వ దశకంలో కలిసి నటించారు. ఆ తర్వాత తమదైన పంథాలో వెళ్తూ భారతీయ సినీ చరిత్రలో తమదైన అధ్యాయాన్ని లిఖించారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దిగ్గజాలుగా ఎదిగారు. ఇప్పుడీ లెజెండ్స్ కలిసి నటించేందుకు ముందుకు రావడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు.