22-02-2026 12:00:00 AM
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్ , పద్మనాభరెడ్డి ఏ నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి శనివారం రిలీజ్ చేశారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “పూర్వజ్ ‘కిల్లర్’ సినిమాను సై ఫై థ్రిల్లర్ జానర్స్ కలిపి బాగా రూపొందించారు. కాంబినేషన్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఈ మూవీ టీజర్ టీజర్ చాలా బాగుంది” అన్నారు.