బీసీలకు అనాదిగా అన్యాయమే!
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే దానం నాగేందర్
- మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవనాని భూమి పూజ
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): అనాదిగా బీసీలను విభజించు పాలించు ధో రణిలోనే అగ్రవర్ణ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గత ప్రభుత్వం కోకాపేటలో మున్నూరు కాపులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలం లో ఆత్మ గౌరవ భవనానికి ట్రస్ట్ బోర్డు చైర్మ న్ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆదివా రం భూమి పూజ నిర్వహించారు.
ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలు కులా ల వారిగా విడిపోతూ ఆయా కుల వర్గాల్లోనే గ్రూపులుగా విడిపోవడం వల్ల బీసీ వర్గాలు ఆయా కులాలకు చాలా నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ము న్నూరు కాపులను అతి స్వల్పంగా చూపించడంలో లోపం ఎక్కడుందో గ్రహించాలన్నా రు. కోకాపేటలో నిర్మించే భవనం భవిష్యత్ తరాలకు గొప్ప ఉపాధి సెంటర్‌గా మారాలన్నారు.
భవనం నిర్మించి పేద విద్యార్థులకు మంచి హాస్టల్ వసతి కల్పించి గొప్ప విద్యావంతులను తయారు చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం స్థలం మంజూరు చేసి ఐదు కోట్ల కేటాయించినప్పటికీ నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు. భవన నిర్మాణం కోసం ట్రస్ట్ బోర్డు సాయాశక్తుల కృషి చే స్తుందని అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెదక్ పార్లమెంట్ సభ్యులుగా పోటీచేసిన గాలి అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పట్నం పురుషోత్తం రావు, రాష్ట్ర బోర్డు కార్యదర్శి రౌతు కనకయ్య, సభ్యులు మంగళారపు లక్ష్మణ్,తూడి ప్రవీణ్, పన్నాల విష్ణువర్ధన్, రమేష్ హజారి, ము న్నూరు కాపు సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కోశాధికారి సత్యనారాయణ, మహిళా అధ్యక్షురా లు బండి పద్మ, రాష్ట్రంలోని వివిధ సంఘాల ప్రతినిధులు వ్యాపార వాణిజ్య వేత్తలు తదితరులు పాల్గొన్నారు.






