10 May, 2026 | 12:35 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

భాగవతం కళాకారులకు వాయిద్యాలు అందజేత

25-12-2025 04:14 PM

బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో భాగవతం కళాకారులకు సంకినేని కమలమ్మరామారావు  జ్ఞాపకార్థం 13000 పదమూడు వేల రూపాయల విలువ చేసే మద్దెల, హార్మోనియం సంగీత వాయిధ్యాలను బహుకరించిన బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం భాగవతం కళాకారులకు ఇచ్చిన హామీ మేరకు వారిని ప్రోత్సహించి, జీత,భత్యాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయి బాబ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఉప్పల లింగయ్య కత్తుల నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.