ఏసీబీకి చిక్కిన బాణాపురం కార్యదర్శి
28-06-2026 12:08 AM
- ఇంటి నిర్మాణానికి రూ.40 వేలు డిమాండ్
- ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఘటన
ముదిగొండ/ఖమ్మం, జూన్ 27(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ముదిగొండ మండ లంలో శనివారం ఏసీబీ దాడులు జరిగాయి. ముదిగొండ మండలం బాణాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి సురేష్ 40 వేలు డిమాండ్ చేశాడు.
చివరకు రూ.25 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోగా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని వీరబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముదిగొండ రైతు వేదిక వద్ద పంచాయతీ కార్యదర్శికి వీరబాబు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు సురేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.






