నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్
- స్కిల్ ఇండియా జాబ్‌మేళాతో కెరీర్‌కు సరైన బాట
- అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
- ‘స్కిల్ ఇండియా మిషన్’ డైరెక్టర్ కపిలవాయి దిలీప్‌కుమార్
- వరంగల్ కిట్స్‌లో జాతీయస్థాయి కౌశల్ మహోత్సవ్
- భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
- వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు
హనుమకొండ, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు స్కిల్ ఇండియా మిషన్ ఎంతో దోహపడుతుందని మాజీ ఎమ్మెల్సీ, స్కిల్ ఇండియా తెలంగాణ డైరెక్టర్ కపిలవాయి దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో అనేక జాబ్‌మేళాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
శనివారం వరంగల్‌లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) కళాశాల ప్రాంగణంలో.. ప్రభుత్వం, లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కౌశల్ మహో త్సవ్ మెగా జాబ్‌మేళా, స్కిల్, లోన్ మేళా నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుస్ప్రీత్ సింగ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కె.అశోక్‌రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ ద్వారా యువతకు ఉద్యోగాలు మాత్రమే కాకుండా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమ లు ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించాలని సూచించారు. జాబ్‌మేళాకు వచ్చిన కంపెనీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ సీపీ సుస్ప్రీత్ సింగ్ మాట్లా డుతూ పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగం సాధించాలన్నా నైపుణ్యాలు అత్యంత అవసరమన్నారు. వరంగల్ నగరం నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు బయటకు వస్తున్నారని, వారిలో చాలామందికి పరిశ్రమలకు సంబంధించిన నైపు ణ్యా లు ఇంకా అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. జాబ్, స్కిల్, లోన్ మేళా నిర్వహిం చిన దిలీప్‌కుమార్‌ను సీపీ అభినం దించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. నైపుణ్యాలను వేడుకగా జరుపుకోవడం, యువతను సాధికారతతో తీర్చిదిద్దడం, ఉజ్వల భవిష్యత్తును నిర్మించడం.. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మా ట్లాడుతూ విద్యను ఉద్యోగాలతో అనుసంధానించే వేదికగా ఈ జాబ్ మేళా నిలుస్తుంద న్నారు. యువత మాదకద్రవ్యాలు, గంజా యి, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సరికొత్త సాంకేతికతలను ఆస్వాదించి, మెరుగైన ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాని కోరారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయి ని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ యువత మంచి పరిజ్ఞానంతో పాటు నైపుణ్య ఆధారిత డిగ్రీని పొందాలని సూచించారు. అంకి తభావంతో పనిచేసే స్వీయ ప్రేరణే విజయానికి కీలకం అన్నారు. హుస్నాబాద్ మాజీ ఎ మ్మెల్యే ఒడితల సతీష్‌బాబు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతులుగా, నైతికంగా బలమైన వారిగా తీర్చిదిద్దడానికి వరంగల్ కిట్స్ కృషి చేస్తుందని తెలిపారు.
తెలుగు అకాడమీ ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపా టి వెంకటనారాయణ, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఉస్మానియా విశ్వవి ద్యాలయం మాజీ లా డీన్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడారు. దేశానికి యు వతే అతిపెద్ద సంపద అని అన్నారు. ఉపాధి ద్వారా ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతాయని, దేశ అభివృద్ధికి అది కీలకమని పేర్కొ న్నారు. ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
6 వేల మంది రిజిస్ట్రేషన్
ఈ మెగా జాబ్‌మేళాలో 101 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 6,000 మంది నమోదు చేసుకున్నారు. వారిలో 1,000 మందికి పైగా అభ్యర్థులు వివిధ సంస్థల ద్వారా ఉద్యోగాల కోసం షార్టస్ట్ చేయబడ్డారు. కౌశల్ భారత్/ వికసిత్ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా జాబ్‌మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, కిట్స్ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అరవింద్, తెలంగాణ ఎన్‌ఊసీడీసీ ఎంగేజ్‌మెంట్ అధికారి ప్రశాంత్, ప్రాంతీయ సంచాలకులు రవి, రిటైర్డ్ ప్రొఫెసర్ కురాపాటి వెంకటనారాయణ,మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఓయూ మాజీ లా డీన్ గాలి వినోద్‌కుమార్, యుబీఐ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్‌రెడ్డి, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్‌ఓ, డాక్టర్ డి. ప్రభాకరాచారి జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలోని టీఓఎంసీఓఎం ప్రతినిధులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.






