కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష
28-06-2026 01:00 AM
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
- అపాయింటెడ్ డేట్ ప్రకటించాలి
- బహుజన వర్కర్స్ యూనియన్ నేతలు సంపత్, కుమార్
- మూడో రోజుకి చేరిన ఆమరణ నిరాహార దీక్ష
- ఆరెస్ట్ చేసినా గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న సంపత్ ముదిరాజ్
హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్‌తో బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్, కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడవ రోజుకు చేరుకుంది. తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంపత్ ముదిరాజ్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 30 మంది పోలీసులు భగ్నం చేసి ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయినా కూడా ఆయన ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. సంపత్ సచ్చుడు విలీనం తెచ్చాడో అనే నినాదంతో దీక్షను కొనసాగిస్తున్నారు. బహుజన్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రికి చేరుకొని వారి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.






