28 June, 2026 | 12:57 AM

వైభవంగా యాదాద్రీశుడి కల్యాణం

28-06-2026 12:10 AM

నిత్య ఆదాయం రూ.35,91,585           

యాదగిరిగుట్ట, జూన్ 27 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజలు వైభ వంగా నిర్వహించారు. గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభువులను సువర్ణ ప్రతిష్ఠ మూర్తులను వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచా మృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కల్యాణాన్ని అంగరం వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుక ను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆల యంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి నిత్య రాబడి రూ.35,91,585 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.