ఉద్యోగుల బదిలీలపై నిషేధం
02-06-2026 01:23 AM
- జూన్ 1 నుంచి ఆరు నెలల పాటు ఆంక్షలు
- తాత్కాలికంగా ఆగిన బదిలీల ప్రక్రియ
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఉద్యోగుల బదిలీలపై ఆరు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి వచ్చే ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపిం ది. పాలనాపరమైన అవసరాలు లేదా ప్రత్యేక అనుమతులు ఉన్న సందర్భాలు మినహా సాధారణ బదిలీలకు అవకాశం ఉండదు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ వి భాగాల్లో బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతులిస్తూ ఏప్రిల్ నెలలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.






