డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు
జిల్లా ఎస్పీ నరసింహ
కోదాడ (అనంతగిరి), జాన్ 23 : ఫ్రెండ్స్తో సరదాగా ఒక్కసారే అనుకొని డ్రగ్స్ జోలికి వెళ్తే జీవితం సర్వనాశనం అవుతుంది జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. అనంతగిరి మండల పరిధిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన పై పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. నేటి యువత దేశాభివృద్ధికి పాటుపడే వనరులుగా ఎదగాలని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకై నిరంతరం కృషి చేయాలని కోరారు.
గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడే వనరు కావాలి, ఇష్టం ఉన్న, నైపుణ్యం ఉన్న రంగంపై దృష్టి పెట్టాలి, గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప లీడర్స్ కావాలి అని ఎస్పి విద్యార్ధులను చైతన్య పరిచారు. యువత, విద్యార్థులు దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో, యువతలో మార్పు రావాలి, డ్రగ్స్ నిర్మూలన కోసం బాధ్యతగా ఉండాలి అని కోరారు.
సమాజంలో డ్రగ్స్ ను నిర్మూలించడంలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అని అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ముందుంటామని ప్రతిజ్ఞ చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీసు కళాబృందం వారు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్ కుమార్, షి టీమ్ ఎస్‌ఐ మల్లేష్, కళాశాల ప్రిన్సిపాల్ డా.సురేష్ కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ ఏం.ఈశ్వరయ్య, వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, ప్రసాద్, భూపతిరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.






