24 June, 2026 | 2:29 AM

బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్

24-06-2026 01:25 AM

భూత్పూర్, జూన్ 24 : మండల పరిధిలోని పాత మొల్గర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూము శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.