2 May, 2026 | 4:08 AM

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి

02-05-2026 02:45 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త

నూతన కమిటీలకు బాధ్యతల అప్పగింత

హైదరాబాద్, మే౧(విజయక్రాంతి): నాగోల్‌లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంప్ కార్యా లయంలో ఐవీఎఫ్ మహిళా విభాగానికి చెందిన పలు నూతన కమిటీల నియామక ప త్రాలను పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేశారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, ఆర్య వైశ్యులు సామాజికంగా మాత్రమే కాకుండా రాజకీయ రం గంలో కూడా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్య వైశ్యులను ఏకం చేయడమే ఐవీఎఫ్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన నూతన కమి టీ సభ్యులను ప్రకటించి, వారికి బాధ్యతలు అప్పగించారు.

చైతన్యపురి కమిటీ: అధ్యక్షురాలు బి.అన్నపూర్ణ, కార్యదర్శి బి.కరుణ, ఖజాంచి కె. ఇందిర, అల్కాపురి కమిటీ, అధ్యక్షురాలు ఎం.జయలక్ష్మి,ఇబ్రహీంపట్నం క మిటీ, అధ్యక్షుడు శ్రీరామ్ సుజాత, కార్యదర్శి వి.నవ్యశ్రీ, ఖజాంచి కల్పనా, ఖైరతాబా ద్ కమిటీ, అధ్యక్షురాలు శ్రీదేవి, గుండ్లపోచంపల్లి కమిటీ, అధ్యక్షురాలు, రాజిని బి, కార్యద ర్శి మంజుల జి, ఖజాంచి, చ. పద్మిని. అదనంగా, రాష్ట్ర సాంస్కృతిక యూనిట్ చైర్మన్ గా డాక్టర్ బండారు సుజాత శేఖర్‌ని నియమించారు.

పలు బతుకమ్మ పాట రచించి అవార్డులు అందుకున్నారు. అలాగే నాగోల్ జీఎస్‌ఐ అధ్యక్షురాలిగా గజవెల్లి శైలజని ని యమించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త  నూతనంగా నియమితులైన స భ్యులకు అభినందనలు తెలియజేస్తూ, స మాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ ప్ర ధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్త, కట కం శ్రీనివాస్ ఐవీఎఫ్ మహిళ అధ్యక్షురాలు మంజుల, ఐవీఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న, చంద భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.