calender_icon.png 11 February, 2026 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

11-02-2026 02:55:39 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): రానున్న మహాశివరాత్రి మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం జలపల్లి సర్కిల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు మరియు పెండింగ్లో ఉన్న పనులపై అధికారులతో చర్చించారు. పండుగల సమయంలో వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని, వీధి దీపాల నిర్వహణలో ఎక్కడా లోపాలు ఉండకూడదని సూచించారు.

వేసవి దృష్ట్యా మరియు పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కాలనీలలో పెండింగ్లో ఉన్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్ దశలో ఉన్న పనులకు ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే ప్రారంభించాలని తెలిపారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

పండుగల సమయంలో భక్తులకు, ప్రజలకు కనీస సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. అధికా రులు సమన్వయంతో పనిచేసి ముందస్తు ప్రణాళికలను అమలు చేయాలని  ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్, డీఈలు, ఏఈలు, సానిటేషన్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.